ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

మలికిపురంలో జయహో జనసేనాని

Share this Post

  • శ్రీ పవన్ కళ్యాణ్ కి అడుగడుగునా అపూర్వ సాగతం
  • ఆడపడుచుల హారతులు.. పూల వర్షం మధ్య భారీ ర్యాలీ
  • జనంతో కిక్కిరిసిన రహదారులు
  • దిండి – మలికిపురం వేలాది బైకులతో రోడ్ షో
  • తూర్పు నుంచి పశ్చిమ గోదావరిలో అడుగు పెట్టిన వారాహి విజయ యాత్ర
    రాజోలు నియోజకవర్గం జయహో జనసేనాని అంటూ నినదించింది. వారాహి విజయ యాత్రతో మలికిపురం మండల ప్రజానీకం మొత్తం రహదారులపై బారులు తీరారు. దిండి నుంచి మలికిపురం బహిరంగ సభకు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి ప్రతి అడుగులో అపూర్వ స్వాగతం లభించింది. దిండి రిసార్ట్ నుంచి అడుగడుగునా ఆడపడుచులు హారతులు పట్టగా., జన సైనికులు పూల వర్షంతో తడిసిముద్దయ్యారు. దిండి, మేడిచర్లపాలెం, గుడిమెళ్లంక గ్రామాల్లో మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ కి గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. వారాహి విజయ యాత్రను చూసేందుకు మేడిచర్లపాలెం గ్రామస్తులు మొత్తం.. వయోబేధం లేకుండా రహదారికి ఇరువైపునా నిలబడి జనసేనానికి నీరాజనాలు పలికారు. దిండి రిసార్ట్ నుంచి వేలాది మంది జనసైనికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా మలికిపురం వరకు అనుసరించారు.
    దిండి – మలికిపురం మధ్య మార్గం మొత్తం జనసేనానికి కట్టిన స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. జనసేన నినాదం హల్లో ఏపీ.. బైబై వైసీపీ నినాదంతో ఫ్లెక్సీలు, హోర్డింగులు నిండిపోయాయి. శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుతో మిగిలిన స్టార్ హీరోల అభిమానులు తమ మద్దతు తెలుపుతూ రోడ్డెక్కారు. మేము మహేష్ బాబు అభిమానులం.. మా ఓటు జనసేనకు అంటూ కొంత మంది చేతుల్లో మినీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జనసేన శ్రేణులు, జనసేనానికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళల జయ జయధ్వనులతో రహదారులు దద్దరిల్లాయి. శ్రీ పవన్ కళ్యాణ్ మలికిపురం చేరగానే పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాజోలు నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను సభకు వచ్చిన ఆశేష జనవాహినికి స్థానిక జనసేన శ్రేణులు పంచారు. ఈ యాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పంతం నానాజీ, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, యాత్ర నిర్వహణకు రాజోలు సమన్వయకర్తలుగా వ్యవహరించిన శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ అమ్మిశెట్టి వాసు, నియోజక వర్గాల ఇంచార్జులు, రాజోలు నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు.• అన్నవరంలో తొలి అడుగు వేసి…
    ఈ నెల 14వ తేదీన అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధిన పరుగు ప్రారంభించిన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదటి దశ ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టింది. జిల్లాలో పది రోజులపాటు సాగిన వారాహి విజయ యాత్ర 8 నియోజకవర్గాల మీదుగా సాగింది. యాత్ర ఆద్యంతం మేధావులు, వివిధ వర్గాల ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ మమేకమయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేశారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కత్తిపూడి నుంచి మలికిపురం వరకు 6 బహిరంగ సభల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గళం విప్పారు.
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి అడుగులు
    మలికిపురం బహిరంగ సభ అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విజయ యాత్రను విజయవంతంగా ముగించుకుని దిండి బ్రిడ్జి మీదుగా వారాహి రథం పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ శ్రేణులు, ప్రజల నీరాజనాల మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ నరసాపురం చేరుకున్నారు. మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, పార్టీ నాయకులు, జన సైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ కి చించినాడ బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలికారు.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *