జనసేనానికి అర్చక స్వాములు, పాస్టర్ల ఆశీర్వచనాలు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి సకల శుభాలు కలగాలని, ఆయన సంకల్పం సిద్ధించాలని నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రధాన దేవాలయాల అర్చక స్వాములు ఆశీర్వచనం చేశారు. సోమవారం నరసాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ ని కలిసి పవిత్ర వస్త్రాలు అందించి వేదాశీర్వచనం ఇచ్చారు.
వారాహికి ఎదురులేకుండా కార్యక్రమం సజావుగా సాగేలా ముక్కోటి దేవతల కరుణ శ్రీ పవన్ కళ్యాణ్ మీద ఉండాలని ఆకాంక్షిస్తూ వేదమంత్రోచ్చరణలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, బదిరుడైన శ్రీ భాస్కర్ సైతం జనసేనాని విజయాన్ని ఆకాంక్షిస్తూ నిండైన మనసుతో సంకల్పం చేశారు. అనంతరం నరసాపురం క్రైస్ట్ లూథరన్ చర్చికి చెందిన పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. బైబిల్ వాక్యం చదివి ఆశీర్వాదాలు అందించారు.
