ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

వారాహి విజయ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు..

Share this Post

ఈ నెల 14న ప్రారంభమైన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగింది. నేటి మలికిపురం సభతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దశను ముగించి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు ఈ యాత్రను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు చెందిన పిఏసీ సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులకు నా హృదయపూర్వక అభినందనలు. యాత్ర సాఫీగా సాగడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లిన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్, కమిటీ సభ్యులకి, యాత్ర కోసం ఏర్పాటైన వివిధ కమిటీల సభ్యులకి ప్రత్యేక అభినందనలు. వారాహీ విజయ యాత్రకి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *