వైసీపీ నిరంకుశ పాలనతో సామాన్యుడి నడ్డి విరుస్తోంది
సర్వేపల్లి నియోజకవర్గంలో 27వ రోజు జనం కోసం జనసేన
వైసీపీ నిరంకుశ పాలనలో సామాన్యుడి కష్టాలు వర్ణణాతీతమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ స్పష్టం చేశారు. ఆకాశాన్నంటిన నిత్యవసరాలకు తోడు కూరగాయల ధరలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చేశాయని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైసీపీ నాయకులు దోచుకుని.. దాచుకునే పనిలోనే ఉన్నారని ఆరోపించారు. నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తున్న జనం కోసం జనసేన కార్యక్రమం 27వ రోజు ముత్తుకూరు మండలం, కోమటిగుంట గ్రామంల ఇంటింటికీ జనసేన పార్టీ సిద్ధాంతాలు, వైసీపీ వైఫల్యాలను వివరించారు. ప్రతి ఇంటికీ ఓ జామ మొక్క పంపిణీ చేస్తూ.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించి వేయాలని కోరారు. కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు శ్రీ రహీం, శ్రీ అశోక్, శ్రీ ఖాజా, శ్రీ శ్రీహరి, శ్రీ వినాయతుల, శ్రీ సీనయ్య, తదితరులు పాల్గొన్నారు.
