శ్రీ టీ.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన జయభేరి కార్యక్రమానికి విశేష ఆదరణ.!
అనంతపురము అర్బన్ ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన జయభేరి కార్యక్రమానికి విశేష ఆదరణ.! వైసిపి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అకృత్యాలను అర్హులైనప్పటికీ ప్రభుత్వ పథకాలను అందించడంలో చూపుతున్న పక్షపాత వైఖరిని తూర్పార బట్టారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలను వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే అనంత నగరానికి చేసే అభివృద్ధిని పేర్కొంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అనంత నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అభివృద్ధిని మంట కలిపి స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న అధికార వైసిపిని ఎదిరిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి జనసేన పార్టీని ఆదరించాలని టి.సి.వరుణ్ గారు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క జనసైనికుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
