తిరుపతి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్
భారీ ర్యాలీగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి పయనం
జన సైనికుడు శ్రీ కొట్టే సాయిపై పోలీసు అధికారిణి విచక్షణారహిత దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ కిరణ్ రాయల్, శ్రీ రాందాస్ చౌదరి , శ్రీ జె.రాజారెడ్డి, శ్రీమతి వినుత కోట, శ్రీమతి అకేపాటి సుభాషిణి, శ్రీ పొన్న యుగంధర్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ ముకరం చాంద్, శ్రీ టి.సివరుణ్, తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉదయం నుంచే పార్టీ నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు
