ప్రముఖ రచయిత శ్రీ రమణ ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ రచయిత, పాత్రికేయులు శ్రీరమణ గారి మరణం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీరమణ గారు రాసిన ‘మిథునం’ కథ చదువుతుంటే మన తెలుగుదనం, ఆలుమగల ఆప్యాయతలు, కుటుంబ బంధాలు… కళ్ల ముందు కనిపిస్తాయి. సునిశిత హాస్యం, పదునైన వ్యంగ్యం రాయడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. శ్రీకాలమ్, శ్రీఛానెల్ లాంటి శీర్షికల ద్వారా చేసిన రచనలు పాఠకులను ఆకర్షించాయి. శ్రీరమణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు.
