శ్రీ జె.పి.నడ్డాతో శ్రీ పవన్ కళ్యాణ్ చర్చలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారితో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీలో శ్రీ నడ్డా గారి నివాసంలో విస్తృత చర్చలు సాగాయి. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు గురించి ఈ భేటీలో మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
