జనసేన అధికార ప్రతినిధిగా శ్రీమతి కన్నా వెంకట మెహర్ రజని
గుంటూరు నగరానికి చెందిన న్యాయవాది శ్రీమతి కన్నా వెంకట మెహర్ రజని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి రజనికి నియామక పత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ భావజాలాన్ని, ప్రజా పక్షం వహిస్తూ చేపట్టే పోరాటాల గురించి బలంగా గళం వినిపించాలని సూచించారు. న్యాయవాదిగా మానవ హక్కులకి సంబంధించిన అంశాలపై శ్రీమతి రజని సాధికారత కలిగి ఉన్నారు.
