సీఎం వెంకటగిరి వస్తే.. తిరుపతిలో హౌస్ అరెస్టులా?
- దమ్ముంటే జగన్ శ్రీ పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు బదులివ్వాలి
- ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిదో చెప్పాలి
- జనసేన తిరుపతి పట్టణాధ్యక్షులు శ్రీ రాజారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తిరుపతి నగరాధ్యక్షులు శ్రీ రాజారెడ్డి డిమాండ్ చేశారు. జనసేనాని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేకే ముఖ్యమంత్రి పిచ్చ ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు నిబద్దత ఉంటే వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ నానక్ రామ్ గూడాలో ఉన్న కంపెనీ ఎఫ్ఓఏకి ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ కంపెనీ ఎవరిదో చెప్పాలన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కొంత మంది వాలంటీర్లు మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడడం నిజం కాదా? వివాహితుల కాపురాలు కూల్చడ్ నిజం కాదా? వాలంటీర్లు సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటు బాధ్యత మీ మంత్రి తీసుకుంటారా? అధికారులు తీసుకుంటారా? వాలంటరీలకు ఐడీ కార్డులు ఇవ్వకపోవడం వెనుక మర్మం ఏంటి? వాలంటీర్లు ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇందులో ఏ ఒక్క ప్రశ్నకి ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు.. అందుకే వెంకటగిరి నేతన్న నేస్తం సభలో ఎప్పటిలాగే పిచ్చవాడుగు వాగి వెళ్లిపోయారని మండిపడ్డారు. మహిళలు ఎందుకు అదృశ్యమవుతున్నారన్న విషయాన్ని పక్కన పెట్టి.. ఈ దారుణాలను మరుగున పెట్టేందుకు సీఎం జగన్ పనికిరాని వాగుడుకి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. జగన్ బెంగళూరు ప్యాలెస్ రాసలీలల బాగోతాన్ని బయట పెట్టుకుండా వందల కోట్ల ముడుపులు ఇచ్చిన అంశానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. తల్లి, చెల్లిని బయటికి గెంటేసిన దుర్మార్గుడు రోడ్లు ఎక్కి నీతి కబుర్లు చెబుతున్నాడన్నారు. మందహానం వెనుకు ఉన్న రాక్షసత్వపు దుర్మార్గాల చిట్లను సాక్ష్యాదారాలతో త్వరలోనే బట్టబయలు చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు శ్రీ రాజేష్ యాదవ్, శ్రీ బాబ్జి , శ్రీ రాజమోహన్, శ్రీ మునస్వామి, శ్రీ సాయిదేవ్, శ్రీ గుట్టా నాగరాజు, శ్రీ సుమన్, శ్రీ మనోజ్, శ్రీ ఆది కేశవులు తదితరులు పాల్గొన్నారు.
