అనంతలో జనసేన జయభేరి.. 30 కుటుంబాల చేరిక..
- బిందెల కాలనీలో శ్రీ టీసీ వరుణ్ ఆధ్వర్యంలో..
జనసేనను ఆదరించండి.. అనంతను అభివృద్ధి చేస్తామంటూ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ జనం బాట పట్టారు. జనసేన జయభేరి పేరిట సాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు హారతులు పడుతున్నారు. శనివారం బిందెల కాలనీలో ఇంటింటికీ జనసేన పార్టీ సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ ఆవశ్యకతను వివరించారు. శ్రీ టీసీ వరుణ్ వస్తున్నారని తెలిసి కొంత మంది ప్రజలు పూల మాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా శ్రీ టీసీ వరుణ్ కోరారు. కార్యక్రమంలో భాగంగా బిందెల కాలనీకి చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. శ్రీ టీసీ వరుణ్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
