యుద్ధానికి సిద్ధం కండి..
- తిరుపతి క్రియాశీలక సభ్యులకు జనసేన నేతల పిలుపు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన ఎన్నికల యుద్ధానికి పార్టీ క్రియాశీలక సభ్యులంతా సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ శ్రీ కిరణ్ రాయల్ లు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు కిట్లు అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యులంతా కొంత సమయం పార్టీకి కేటాయించి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పాలన్నారు. అనంతరం తిరుపతికి చెందిన పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు.
