కృషాయపాలెంలో జనసేన నిరసన..
- ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన చోటే బైఠాయింపు
- హక్కులేని చోట భూమి పూజ చేసి మోసగిస్తున్నారని ఆరోపణ
రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల శంకుస్థాపనల పేరిట ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. కృష్ణయపాలెంలో ముఖ్యమంత్రి భూమి పూజ చేసిన చోట జనసేన నాయకులు నిరసనకు దిగారు. హక్కు లేని చోట శంకుస్థాపన చేస్తూ ప్రజలను ఈ ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని లేకుండా చేతకాని పాలన చేస్తున్న ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి బిట్రగుంట మల్లికా, పార్టీ నాయకురాళ్లు శ్రీమతి రాజనాల నాగలక్ష్మి, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీమతి మల్లెల అనిత, శ్రీమతి మట్టి జయలత, శ్రీమతి కమల, శ్రీమతి రంగిశెట్టి రమాదేవి, శ్రీ రాజేష్, శ్రీ చావలగిరి సుందరయ్య తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- పోలీసుల అదుపులోకి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్
కృష్ణాయపాలెం సీఎం శంకుస్థాపన నేపధ్యంలో పార్టీ పిలుపు మేరకు ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆయనతో పాటు పార్టీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
