ఆంధ్ర ప్రదేశ్మీడియావిజయవాడ

శ్రీ పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి వ్యాఖ్యలపై పెల్లుబికిన నిరసన జ్వాలలు

Share this Post

  • ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికిన ఉమ్మడి కృష్ణాజిల్లా
  • జోగి రమేష్ కు శవయాత్రలు నిర్వహించిన శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్
  • అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ శ్రేణులు భగ్గు మన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. జనసేన నాయకులు, కార్యకర్తల ఆందోళనలు, అరెస్టులతో విజయవాడ నుంచి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తన్న పెడన నియోజకవర్గం వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా అట్టుడికింది. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో వీర మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారు. పిచ్చి కుక్క జోగి రమేష్ అంటూ నినదిస్తూ వీర మహిళలు మంత్రి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. బ్రోకర్ జోగి రమేష్.. జోకర్ జోగి రమేష్ అంటూ చేసిన నినాదాలతో విజయవాడ మారుమ్రోగింది. జోగి రమేష్ శవాన్ని దహనం చేసే ప్రయత్నం చేయగా., పోలీసులు అడ్డుకుని శ్రీ అమ్మిశెట్టి వాసును అరెస్టు చేశారు. ప్రభుత్వ సొమ్ములు పంచే సభల్లో బూతులు మాట్లాడుతున్న జోగి రమేష్ లాంటి వారిని చెప్పుతో కొట్టాలని.. మంత్రి పదవి పక్కన పెట్ట వస్తే జోగి రమేష్ ని విజయవాడ నడిరోడ్డు మీద బట్టలూడదీసి కొడతామని ఈ సందర్భంగా శ్రీ అమ్మిశెట్టి వాసు హెచ్చరించారు. అధికారమదం నెత్తికెక్కి పిచ్చ వాగుడు వాగుతున్నాడనీ, సీటు రాధన్న భయంతో కారు కూతలు కూస్తున్నాడని.. 8 నెలల్లో మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే గిరి కూడా ఊడి జోగి ఇంట్లో కూర్చోవడం ఖాయమని హెచ్చరించారు.

గూడూరులో జోగి రమేష్ శవయాత్ర
మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలోనూ జనసేన శ్రేణుల ఆందోళనలు మిన్నంటాయి. గూడూరు మండల కేంద్రం వేదికగా జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో జోగి రమేష్ దిష్టిబొమ్మకు పార్టీ శ్రేణులు శవయాత్ర నిర్వహించాయి. జోహార్ జోగి.. చేత గాని జోగి.. చిత్తకుక్క జోగి అంటూ జనసైనికులు చేసిన నినాదాలు గూడురు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వినబడ్డాయి. శాంతియుతంగా రహదారికి ఒక పక్కన శవయాత్ర నిర్వహిస్తున్న శ్రీ రామ్ సుధీర్ తో పాటు పార్టీ శ్రేణులను గూడూరు పోలీసులు అరెస్టు చేసి స్థానిక స్టేషన్ కి తరలించారు. సాయంత్రం వరకు వదిలేది లేదని తేల్చి చేప్పేశారు. జోకర్ జోగి రమేష్ పరిధి దాటి మాట్లాడుతున్నాడని, శ్రీ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని శ్రీ రామ్ సుధీర్ ఈ సందర్బంగా హెచ్చరించారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *