శ్రీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే వరకు శ్రమిద్దాం
- జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి
క్రియాశీలక సభ్యులంతా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా స్వీకరించి వారి కుటుంబాలకు క్రియాశీలక సభ్యత్వం ద్వారా భరోసా కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం కంకణబద్దులై పని చేయాలన్నారు. మంగళవారం పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా కిట్లు అందచేశారు. ఈ సందర్భంగా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన క్రియా వాలంటీర్లను సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
