జనసేన ఎన్ఆర్ఐ విభాగానికి సమన్వయ కమిటీ..
జనసేన ఎన్ఆర్ఎస్ఐ విభాగం ‘శ్రీ అరబిందో విశ్వ వీణ’ (SRI AUROBINDO VISWA VEENA – ‘SAWE’) కార్యకలాపాలను సమన్వయపర్చడానికి ముగ్గురు సభ్యులు, ఒక సలహాదారుని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. శ్రీ రామ్ తాళ్లూరి, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శ్రీమతి రుక్మిణి కోట ఈ కమిటీలో క్రియాశీలక సభ్యులుగా ఉంటారు. శ్రీ టి.జి. విశ్వ ప్రసాద్ ఈ కమిటీకి సలహాదారుగా వ్యవహరిస్తారు. యూఎస్, ఆస్ట్రేలియా, యూరోప్, గల్ఫ్ తదితర దేశాలలోని జనసేన ఎన్.ఆర్.ఐ. విభాగాలను ఈ కమిటీ సమన్వయపరుస్తుంది. ఎన్ఆర విభాగానికి అంతర్జాతీయ కార్యవర్గం నియామకం జరిగే వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యకలాపాలు ముందుకు సాగుతాయి.
