ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

లైవ్ అప్డేట్స్ : పిఠాపురం వారాహి విజయ యాత్ర సభ జనసేనాని ప్రసంగం

Share this Post

శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురం రావడం నేను చేసుకున్న అదృష్టం

ఒక దశాబ్ద కాల ప్రయాణం నేను ఎందుకు నిలబడ్డాను అంటే మీ భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం

గోదావరి తల్లి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, నేను ఈ నేలను అంటిపెట్టుకుని ఉంటాను

ఒక వయసు వచ్చాక మనకు కావలసింది ఉపాధి అవకాశాలు, అభివృద్ధి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లా ఏదో చేసేస్తా అని చెప్పను, కానీ ఒళ్ళు వంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తాను

సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు బ్రాహ్మణ సమాజానికి ప్రత్యేక నమస్కారాలు. పిఠాపురం వస్తె నాకు దేవతా విగ్రహాల ద్వంసం గుర్తొస్తుంది

ఇక్కడ దేవతా విగ్రహాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తే పిచ్చోల్లు చేశారు అని చెప్పారు. 2019 నుందినిప్పటి వరకు అన్ని విగ్రహాలు పిచ్చోల్లే చేశారా? హిందూ వర్గాలను ఇతర వర్గాలతో గొడవలు పెట్టించి మళ్ళీ ఓట్లు చీల్చి అధికారంలోకి రావాలి అని చచ్చు ఆలోచన ఈ ముఖ్యమంత్రిది

నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు. మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుంది.

వలసలు కట్టడి చేసి యువత నిరుద్యోగ భృతుల పైన ఆధార పడకుండా, అప్పులు తెచ్చి ప్రజల మీద భారం వేయకుండా ఉపాధి కల్పనతో పాటుగా సంపద సృష్టిస్తూ, 175 నియోజకవర్గాల్లో సమాంతరంగా ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కల్పించి అభివృద్ధి వికేంద్రీకరణ సాధనే లక్ష్యంగా జనసేన షణ్ముఖ వ్యూహం!

రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. నేను ఈ నేలను విడిచి వెళ్ళను అని మాట ఇస్తున్నాను

వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని ఇంకోసారి రాణిస్తే ఏ ఒక్కరినీ బ్రతకనివ్వదు ఈ YSRCP ప్రభుత్వం

MP ను కొడతారు, పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే లా & ఆర్డర్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం

జనసేన ప్రభుత్వం అధికారంలోకి తీసుకురండి, పిఠాపురం పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం

హిందూ దేవాలయాలపై YSRCP ప్రభుత్వం కన్నేసింది. TTD ఆదాయంపై కన్నేశారు. శ్రీవాహి ట్రస్ట్ అని పెట్టి విరాళాలు దోచేస్తున్నారు

మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే నాకు ఇష్టమైన చెప్పులు దొంగతనం చేశారు. ఎవరు చేశారో పట్టుకోండి ప్లీజ్,
YSRCP ప్రభుత్వం చెప్పులు దొంగతనం చేసే స్థాయికి వచ్చింది

వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయం. జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తా జాగ్రత్త

నాకు క్రిమినల్స్ అంటే చిరాకు, క్రిమినలైజేషన్ పాలిటిక్స్ అంటే నచ్చదు. గూండాలా మనల్ని పాలించేది? సన్నాసులు, ఈ దరిద్రులా మనల్ని పాలించేది? గూండా గాల్లు, రౌడీ గాళ్లు, హంతకులు ఇలాంటి వారిచేత పాలింపబడటానికి సిగ్గుండాలి మనకి

పిఠాపురం ని. గొల్లప్రోలు మ. దుర్గాడ గ్రామంలో ప్రభుత్వమిచ్చిన 425 ఇళ్ళస్థలాలకుగాను ప్రతీ లబ్ధిదారుడి నుండి ₹21,000 రూపాయలు దోచుకున్న అవినీతి వై.సీ.పీ నాయకులు

ఈ పెద్దమనిషి వై ఎస్ జగన్ కు నేనంటే , మన పార్టీ అంటే భయం. మనం ప్రశ్నించకూడదు అంట

ఈరోజు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమందిని 5 మంది గూండాలు కంట్రోల్ చేయగలరు. అదే మీరు బలంగా ఉంటే గూండాలను త్రొక్కేయగలరు, బలంగా ఉండాలి, నేను మీకోసం నిలబడతాను, కులాలకు అతీతంగా కలిసి నడుద్దాం

ఇక్కడ కాకినాడ MLA రోజుకు 2 కోట్ల రూపాయల మట్టిని తోలేస్తున్నారు, ఆయన అనుచరుడు ఎవరైనా ప్రశ్నిస్తే పిస్టల్ తీస్తాడు

నేను మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా బిడ్డలను తిడుతున్నా భరిస్తున్నాను

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇసుక కాంట్రాక్ట్ తీసుకొని 10వేల కోట్లు దొచేస్తున్నాడు, నేను అదే 10 వేల కోట్లు మన యువత కోసం ఖర్చు పెట్టి పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తాను

సొంత బాబాయి రక్తాన్ని తుడుచుకుని చంపిన వ్యక్తులను రక్షించే వ్యక్తి వై ఎస్ జగన్ , అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారు

MLA మన కులపోడా కాదా అని కాదు, మన కోసం పనిచేసేవాడా కాదా అని ఆలోచించాలి

మత్స్యకారులారా నేను మీ మనిషిని. మీరు గుజరాత్ వద్ద చేపల వేటకు వెళ్ళి తీరం దాటి అనుకోకుండా పాకిస్తాన్ వారికి దొరికితే మీకోసం నేను కేంద్ర మంత్రి గారితో మాట్లాడాను. మీకు ఏ పదవి లేనప్పుడు కూడా అండగా నిలబడ్డాను

నాకు ఎవరూ స్పీచులు రాయరు, నేను సమస్యలను తెలుసుకుంటాను, అర్దం చేసుకుంటాను, మాట్లాడుతాను

నేను ముఖ్యమంత్రిని అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను

2019 లో కూడా ఇంత బలంగా చెప్పలేదు, కానీ శ్రీ పాద వల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు పూర్తిగా మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నాను

అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను. నాకు అధికార పీఠం ఇవ్వండి, నేను సిద్దంగా ఉన్నాను

DGP గారు తప్పులను కప్పిపుచ్చకండి, IPS స్థాయి వ్యక్తి మీరు

గుడిలో నా చెప్పులు ఎత్తకెల్లే ఎదవలు కూడా మనల్ని విమర్శిస్తారు

నిన్న చేబ్రోలు లో పట్టుంపరిశ్రమ సమస్యలపై మాట్లాడడానికి వెళ్తున్నా అంటే అప్పటికప్పుడు YSRCP ప్రభుత్వం నిధులు ఇస్తాం అని ప్రకటించింది

ఈ 2 దశాబ్దాల్లో నేను ఒక్క ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, ఒకే ఒక్క సారి ప్రకటన చేశాను కానీ నేను ఆ తరవాత నేను వాణిజ్య ప్రకటనలు చేయలేదు, కేవలం చేనేత వర్గాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *