అగ్నిప్రమాదం బాధితులకు జనసేన అండ
నిన్న జీలుగుమిల్లి మండలం దర్భాగూడెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధంఅయ్యింది విషయం తెలుసుకుని మండల అధ్యక్షులు పసుపులేటి రాము గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారు, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ గారు, పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు గారు ఘటనస్థలానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి 5,000/- రూపాయల నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు అందించి, మీ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని, హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోలా మధు గారు, దావీదు గారు, కలపాల నరేష్, కలపల శ్రీను, గ్రామ కార్యకర్తలు,పెద్దలు, నాకులు జనసైనికులు పాల్గొన్నారు.
