కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్, రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ సంగిశెట్టి అశోక్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతి
జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన శ్రీ తోట సుధీర్ కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. శ్రీ సుధీర్ కు నియామక పత్రాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందచేశారు. కాకినాడ నగరంలో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్ళే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఎప్పుడూ జన సైనికులకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు. తనపై శ్రీ పవన్ కల్యాణ్ గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను అని శ్రీ సుధీర్ తెలిపారు.
రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ సంగిశెట్టి అశోక్
ఇప్పటి వరకూ కాకినాడ నగర అధ్యక్షుడిగా ఉన్న శ్రీ సంగిశెట్టి అశోక్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. శ్రీ అశోక్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతి
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతిని నియమించారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారు అందచేశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన శ్రీమతి శివపార్వతి పార్టీ వీర మహిళ విభాగంలో చురుగ్గా పని చేస్తున్నారు. తనకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు శ్రీ పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ తరఫున బలంగా గళాన్ని వినిపిస్తాను అని ఆమె తెలిపారు.
