నూతన పార్లమెంట్ భవనం భరతమాతకు మరో మణిహారం : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
నూతన పార్లమెంట్ భవనం… భరతమాతకు మరో మణిహారమని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వీరుల త్యాగఫలంతో స్వాతంత్ర్యం సాధించిన భారతావని… సగర్వంగా వజ్రోత్సవాలు జరుపుకొందని గుర్తుచేశారు. ఈ 75 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు జరిగాయన్నారు. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొత్త నిర్ణయాలు, విజయాలు అందుకున్నామని అన్నారు. అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన … భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోందని… అదే సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనమని వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ నిలయాన్ని…. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన శుభ తరుణాన జనసేన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన నరేంద్ర మోదీకి, భాజపా నాయకత్వానికి అభినందనలు తెలిపారు. భవన నిర్మాణంలో పాల్పంచుకున్న వారంతా చరితార్థులని పవన్ కళ్యాణ్ అన్నారు
Congratulating Prime Minister Narendra Modi on the inauguration of the new Parliament building, Jana Sena Party president Pawan Kalyan on Sunday said it was like a “jewel in the crown of Mother India.” In a press release, Mr. Pawan Kalyan said India was proudly celebrating the diamond jubilee year of its Independence, and the new Parliament could not have come at a more opportune time.The new building was a symbol of the flourishing Indian democracy, the JSP leader observed, and appreciated the fact that the massive structure had a rich collection of arts from various States, and the construction involved skilled workers from across the country.
