ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రి

జనసేన పార్టీ నిరసనలతో వైసిపి నేతలు, కార్పొరేషన్ అధికారులలో చలనం..

Share this Post

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు 18వ డివిజన్ లో శుక్రవారం సబ్ కెనాల్ పంట బోదేను శుభ్రం చేయాలని తలపెట్టిన నిరసన కార్యక్రమానికి డివిజన్ ప్రజల నుండి విశేష స్పందన లభించింది.. ఏడాది జనసేన పోరు బాట కార్యక్రమంలో భాగంగా వంగాయ గూడెం అంబేద్కర్ బొమ్మ వెనకాల పంట కాలువ సమస్యను పరిష్కరించమని జనసేన పార్టీ తరపున నగరపాలక సంస్థ అధికారులకు మార్చ్ 3న వినతిపత్రం ఇచ్చామని, దీనిపై త్వరలో పంట కాలువను శుభ్రం చేస్తామని అధికారులు తెలిపారని, కానీ మార్చి 27 వరకు అధికారులు స్పందించకపోవడంతో జనసైనికులే చందాలు వేసుకుని, మార్చి 28వ తేదీన ప్రోక్ లైనర్ తో పంట కాలువను, తాగునీటి బావిలోని పూడికను తొలగించామని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేస్ 1 ఫేస్ 2 నిధుల నుండి ఒక్కొక్క డివిజన్ కు రు.20 లక్షలు కేటాయించామని చెబుతున్న వైసీపీ నేతలు ఆ నిధులతో వైసిపి పాదయాత్రలో ప్రజలు వెలిబుచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని, మరి ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.. శుక్రవారం పంట బోదె సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి నగరపాలక సంస్థ అధికారులు, వైసిపి నేతలు ముందుగా చేరుకొని ప్రోక్లైన్ తో పంట కాలువను శుభ్రం చేసే పనులకు పూనుకున్నారు.. డివిజన్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం వంటకాలువ శుభ్రం చేయకపోవడంతో జనసేన పాదయాత్రలో తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారని, సామాజిక వర్గం ఓట్లు దండుకున్న వైసిపి పార్టీ వారి సమస్యల పట్ల మొద్దు నిద్ర వహిస్తున్నారని, అప్పలనాయుడు ఆరోపించారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *