ఆంధ్ర ప్రదేశ్జాతీయంరాజమండ్రి

జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బి.వి.ఎస్.ఎస్. ప్రసాద్

Share this Post

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత శ్రీ భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీ వీ ఎస్ ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీ ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలుపంచుకున్నారు. యాగశాలలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించుకున్న అనంతరం కార్యాలయంలోనే ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కాసేపు ముచ్చటించారు. పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వ్యక్తపరిచారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీ బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్.. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చెప్పారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *