ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

జనసేనానికి జేజేలు పలికిన ముమ్మిడివరం

Share this Post

  • హారతులతో స్వాగతం పలికిన ఆడపడుచులు
  • భారీ ర్యాలీ.. రోడ్ షో
  • కోనసీమలో వారాహి విజయ యాత్రముమ్మిడివరం జనసంద్రమైంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చిన జనసేనానికి జనసేన శ్రేణులు, ప్రజలు జేజేలు పలికారు. ఆడపడుచుల హారతులు, జన సైనికుల పూల వర్షం మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో జనసేనాధినేత నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పోటెత్తారు. వారాహి రథం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చే సందేశం వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
    అంతకు ముందు వారాహి విజయ యాత్రలో భాగంగా సాయంత్రం గం. 6. 15 నిమిషాల ప్రాంతంలో కొమానపల్లిలో బస చేసిన ప్రాంతం నుంచి సభా ప్రాంగణం వరకు వేలాది మంది జన సైనికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే రిసార్ట్ కి వేలాదిగా చేరుకున్న పార్టీ శ్రేణుల నినాదాల హోరులో ర్యాలీ జాతీయ రహదారి పైకి చేరగానే స్థానిక పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. నడిమిలంక, 10వ నంబర్ మైలు రాయి, రాజుపాలెం మీదుగా ర్యాలీ కొనసాగింది. ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున మహిళలు రహదారిపైకి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ కి హారతులు పట్టారు. ఆడపడుచులు ఇచ్చిన ప్రతి హారతిని స్వీకరించారు. రోడ్ షో ఆద్యంతం తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జాతీయ రహదారి నుంచి పెద్ద ముమ్మిడివరంలో ప్రవేశించే ప్రదేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ తో స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. బాణాసంచా పేలుళ్లు, మేళతాళాల మధ్య రహదారికి ఇరువైపులా నిలబడిన పార్టీ శ్రేణులు పూల వర్షంతో వారాహి వేదిక వద్దకు ఆహ్వానం పలికారు. వారాహి సభా ప్రాంగణం చుట్టు పక్కల భవనాలు సైతం జనసేనాని సభకు తరలివచ్చిన జనంతో కిటకిటలాడాయి. శ్రీ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ముమ్మిడివరం పట్టణ పరిసరాలు మొత్తం స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సభ ముగింపులో కృతజ్ఞత తెలిపారు.
  • ఆంబులెన్స్ కి దారిచూపి…
    వేలాది మంది జనసైనికుల జయ జయధ్వానాల మధ్య బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ ర్యాలీకి ఆంబులెన్స్ ఎదురు రాగా.. తన కోసం ఏర్పాటు చేసిన గజమాలను పక్కకు నెట్టి ఆంబులెన్స్ కు దారి ఇవ్వమంటూ జన సైనికులకు సూచించారు. ఆంబులెన్స్ ర్యాలీని దాటి వెళ్లే వరకు ట్రాఫిక్ క్లియర్ చేయమని సూచిస్తూనే ఉన్నారు. దారిచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ కి ఆంబులెన్స్ లో ప్రయాణిస్తున్న వారు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
  • కోనసీమ నడిబోడ్డుకు వారాహి విజయయాత్ర
    ముమ్మిడివరం బహిరంగ సభ ముగించుకుని వారాహి విజయ యాత్ర కోనసీమ నడిబొడ్డు అమలాపురంలో ప్రవేశించింది. సభ అనంతరం ముమ్మిడివరం శివారుల నుంచి జనసేన శ్రేణులు వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అమలాపురంలోనూ శ్రీ పవన్ కళ్యాణ్ కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గురువారం నుంచి వారాహి విజయ యాత్ర అమలాపురంలో కొనసాగనుంది.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *