ఆంధ్ర ప్రదేశ్మీడియావిజయవాడ

పెళ్లి బృందానికి ప్రమాదం బాధాకరం

Share this Post

ప్రకాశం జిల్లా దర్శి వద్ద సాగర్ కాలువలో పెళ్లి బృందం బస్సు పడిపోయిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 12 మంది గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వేడుకగా పెళ్లి ముగించుకుని కాకినాడలో రిసెప్షన్ కోసం వెళుతున్న ముస్లిం కుటుంబాల సభ్యులు ఈ ప్రమాదంలో అశువులు బాయడం అత్యంత విచారకరం. గత అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం మానవ తప్పిదమా? లేక ఆర్టీసీ బస్సు సాంకేతిక స్థితి సక్రమంగా లేదా అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. క్షతగాత్రులకు మేలైన వైద్య సదుపాయం కలిగించడంతోపాటు మృతుల కుటుంబాలను ఆర్థికంగా ప్రభుత్వం సాయపడాలని కోరుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *