ఆంధ్ర ప్రదేశ్జాతీయంమీడియా

ఆ కఠిన చట్టం వస్తే వైసీపీకి చుక్కలే!

Share this Post

  • పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే డేటా ప్రొటెక్షన్ బిల్లు
  • చట్టంగా మారితే జరిమానాల మోతే
  • శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పేది ఇదే

కాలం రేసుగుర్రం కంటే వేగంగా కదులుతోంది. సాంకేతికత మనిషిని ఆక్రమిస్తోంది. మానవ మెదడును నియంత్రించే దిశగా సాంకేతికత వచ్చేసిన నేటి యుగంలో ఏ సమాచారం అయినా రహస్యంగా ఉండాల్సిందే. ఇంటర్ నెట్ యుగం వేగం పుంజుకున్న తర్వాత ప్రపంచం ఓ కుగ్రామం అయింది. రోజువారీ మనం లేచిన దగ్గర నుంచి మళ్లీ పడుకునే వరకు చేసే పనుల్లో సాంకేతిక మాయాజాలం మనిషి జీవనంలో భాగమైంది. ఒక్కోసారి సాంకేతికత చెప్పినట్లు మనిషి మెసులుకోవడమే తప్ప వేరే దారి కనిపించడం లేదు. నేటి రోజుల్లో మన వ్యక్తిగత సమాచారం (డేటా) అనేదే కోట్ల ఆస్తి. మనల్ని నియంత్రించేందుకు లేదా మన జీవితాన్ని ప్రభావితం చేసేందుకు నేటి సాంకేతిక యుగంలో డేటానే కీలకం.

  • జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా ఇదే. గతంలోని పరిస్థితులు వేరు. నేడు మారిన కాలమాన పరిస్థితులు వేరు. గతంలో సమాచారం తీసుకుంటే పెద్ద విషయం కాదు.. కానీ ఇప్పుడు సమాచారమే పెద్ద విషయం.. అతి పెద్ద నేరం కానుంది. కాలం మరింత వేగం పుంజుకొని సాంకేతికత వచ్చేసిన తరుణంలో అది మనిషి జీవన పరిస్థితుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అనధికారికంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు సేకరిస్తున్న డేటా పూర్తిగా చట్ట విరుద్ధం. వారు సేకరిస్తున్న డేటా ఎవరికి వెళ్తోంది..? ఎటు వెళ్తోంది అన్నది కూడా తెలియకుండానే కోట్ల మంది సమాచారం బయటకు వెళ్తోంది. ఇది చాలా ప్రమాదకరం అన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆవేదన.
  • వ్యక్తిగత డేటా ఉంటే రోజువారీ మనం చేసే కార్యకలాపాలు, ఇష్టాలు, అభిరుచులు, బంధువులు, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు, బ్యాంకు అకౌంట్లు, ఇలా అన్నీ అంశాలను చాలా సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఉంది. మారుతున్న సాంకేతిక యుగానికి తగినట్లుగా ప్రజల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని, అది ప్రజల హక్కు అని కేంద్రం దీనికోసం ప్రత్యేకంగా డిజిటల్ ప్రొటెక్షన్ బిల్లుకు రూపకల్పన చేసింది. మన వ్యక్తిగత సమాచారం అకారణంగా తీసుకునే వారిని, దాన్ని పక్కదారి పట్టించే వారిపై ఈ బిల్లులో కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. దీనిలో ఎన్నో కీలకమైన అంశాలు, నిబంధనలు ఉండనున్నాయి. ప్రస్తుతం బిల్లు రూపంలో ఉన్న డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం ప్రజల సమాచారం ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండటం క్షమించరాని నేరం.
  • డేటా ప్రొటెక్షన్ బిల్లు చరిత్ర ఇలా మొదలైంది…
  • 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.పుట్టుస్వామి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ వ్యక్తిగత సమాచారం అనేది ప్రజల హక్కు అని, దాన్ని రక్షించాలని చెప్పడంతో ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు అంకురార్పణ పడింది. దీనిపై వెంటనే తగు చట్టం రూపొందించాలనే సూచనతో కేంద్రం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసి, బిల్లుకున్న సాధ్యాసాధ్యాలను, మార్గదర్శకాలను పరిశీలించాలని కోరింది.
  • 2019లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సుతో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ముసాయిదాను కేంద్రం సవరించింది.
  • డిసెంబర్, 2019లో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, 2019 ఉభయ సభల సమీక్ష కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడింది.
  • డిసెంబర్, 2021లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ, 2 సంవత్సరాల తర్వాత తన నివేదికను – డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2021 కొత్త వెర్షన్‌గా తీసుకొచ్చారు.
  • ఆగస్ట్ 2022లో కమ్యూనికేషన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, డ్రాఫ్ట్ DPB (డేటా ప్రొటెక్షన్ బిల్లు), 2021ని ఉపసంహరించుకోవడానికి అనుమతిని మంజూరు చేశారు.
  • నవంబర్ 2022లో ప్రజల సంప్రదింపుల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్సఫర్మేషన్ ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2022ని విడుదల చేసింది.
  • జూలై 5,2023లో DPDP బిల్లును పార్లమెంట్ వర్షాకాలంలో (జూలై20-ఆగస్టు11) టేబుల్‌గా ఉంచేందుకు క్యాబినెట్ ఆమోదించింది.
  • సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన ఆరు సంవత్సరాల తర్వాత, చట్టం పకడ్భందీగా రూపొందించబడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి ఐటీ, టెలికాం రంగాలలో ప్రతిపాదించిన నాలుగు చట్టాలలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (DPDP బిల్లు) ఒకటి.
  • ఇది చట్టంగా మారితే ఉల్లంఘనులకు భారీ జరిమానాలు, శిక్షలు పడతాయి. ఉల్లంఘించినట్లు గుర్తించిన సంస్థలపై రూ.250 కోట్ల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (DPB)కి అధికారం ఇస్తుంది. ఉల్లంఘించిన సంస్థపై విధించే పెనాల్టీని క్యాబినెట్ ఆమోదంతో రూ.500 కోట్ల వరకు పెంచవచ్చు. పెనాల్టీని పెంచడానికి చట్టంలో సవరణ అవసరం లేదు.
  • డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో, చట్టంలోని నిబంధనలను పర్యవేక్షించేందుకు డేటా ప్రొటెక్షన్ బోర్డ్‌ ను ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుకు వచ్చే ఫిర్యాదులు, అభియోగాల ఆధారంగా దర్యాప్తు చేసి, నిజం అని తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ డేటా ఈ బిల్లు చట్టపరమైన డొమైన్‌ ల పరిధిలోకి వస్తుంది.
  • త్వరలోనే రాబోతున్న కఠిన చట్టానికి వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ప్రజల నుంచి తీసుకున్న సమాచారం ఏం చేశారు..? ఎవరి వద్ద ఉంచారనేది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఏ మాత్రం తప్పించుకోవాలనుకున్నా చట్టం మాత్రం వదిలిపెట్టదు.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *