ఆంధ్ర ప్రదేశ్కర్నూలువిజయవాడ

పవన్ కళ్యాణ్‌ను కలిసిన వైసీపీ నేత.. జనసేన పార్టీలోకి ఆమంచి!

Share this Post

బాపట్ల జిల్లా చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ (Amanchi Krishna Mohan) సోదరుడు స్వాములు (Amanchi Swamulu) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. నాగబాబు, నాదేండ్ల మనోహర్‌ను కూడా స్వాములు, ఆయన కుమారుడు రాజేంద్రలు కలిశారు. ఈ నెలాఖరులో స్వాములు జనసేన పార్టీలో చేరతారనిఉహగాహనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమంచి స్వాములు ఫోటో జనసేన పార్టీ (Janasena Party) ఫ్లెక్సీలో ఉండటం చర్చనీయాంశం అయ్యింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జనసైనికులు దీనిని ఏర్పాటు చేశారు. స్వాములు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.

YCP leader Amanchi met Pawan Kalyan.. joins Janasena party!

Bapatla district saree politics has become interesting. Former MLA Amanchi Krishna Mohan’s brother Swamulu (Amanchi Swamulu) met Janasena Party chief Pawan Kalyan. Pawan Kalyan was given a bouquet at his residence. Swamulu and his son Rajendra also met Nagababu and Nadendla Manohar. There are speculations that Swamulu will join the Janasena party at the end of this month.Moreover, recently Amanchi Swamulu’s photo of Janasena Party (Janasena Party) has become a topic of discussion. It was set up by the Janasainiks during the Janasena Party membership registration program at Vetapalem mandal of Bapatla district. Swamulu’s brother and former MLA Amanchi Krishnamohan is currently the YSRCP in-charge of Parchur constituency.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *