ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రి

రాజానగరం మండలం రఘునాథపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అధికార పార్టీ YSRCP నుండి సుమారు 150 మంది చేరిక

Share this Post

రాజానగరం మండలం రఘునాథపురం గ్రామంలో రాజానగరం జనసేన పార్టీ నాయకులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అధికార పార్టీ YSRCP నుండి సుమారు 150 మంది చేరిక.

145 వ రోజు రఘునాథపురం గ్రామంలో ప్రారంభమైన “జనంకోసం జనసేన మహాపాదయాత్ర”

పాదయాత్రలో భాగంగా జనసేన జెండా ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు..

ముందుగా శ్రీరాంపురం గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి రఘునాధపురం గ్రామం వరకు ర్యాలీగా ముందుకు సాగారు…

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి జెండా ను ఆవిష్కరించారు…..

అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు,జనసేన పార్టీ సిద్ధాంతాలను నిత్యం క్షేత్రస్థాయిలో రాజానగరం నియోజకవర్గంలో ప్రజానీకానికి చేరువ చేసి…… మునుపెన్నడూ లేని విధంగా జనసేన పార్టీని నియోజకవర్గంలో బలియమైన శక్తిగా తయారుచేస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ నాయకులు బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో…… ఈ రోజు రఘునాథపురం గ్రామానికి చెందిన YSRCP పార్టీ నేతలు గోనబోయిన వీరాస్వామి గారు, బోల్లేపల్లి త్రిమూర్తులు గారు, చిచ్చారి వీర్రాజు గారు, యర్రా వీర వెంకట సత్యనారాయణ గారు, గోనబోయిన సూరిబాబు గారు, బోల్లేపల్లి గాంధీ గారు, గోనబోయిన విష్ణు గారు, తిక్కన కృష్ణ గారు, మందాల సత్తిబాబు గారు, రేలంగి సతీష్ గారు, రేలంగి రామకృష్ణ గారు, పడమటి వెంకటేష్ గారు, వెలుగంటి వెంకటేష్ గారు, పడమటి రాజేష్ గారు, మన్యం ప్రసన్న కుమార్ గారు, మట్ట శివ కుమార్ గారు, మందాల సత్తియ్య గారు, రేలంగి చందు గారు, మట్ట గణేష్ గారు, మట్ట శివనాగు గారు, ఏకుల వీర వెంకట్రావు గారు, గోనబోయిన గణేష్ గారు, గోనబోయిన కళ్యాణ్ గారు, పలివెల లోవరాజు గారు, బోల్లేపల్లి విజయ్ గారు, బోల్లేపల్లి వినయ్ కుమార్ గారు, మందాల మణికంఠ గారు, మందాల వెంకటరమణ గారు, జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు…

అనంతరం బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ ” జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే ఈ రాష్టానికి గాని…మా నియోజకవర్గానికి గాని అభివృద్ధి అనేది జరుగుతుందని….ప్రస్తుతం అధికార పార్టీ వారు చేసే పనులు చూసి ప్రజలు విసుగు చెందారని…. ఇళ్ల స్థలాలు ఇచ్చాము అని డప్పు కొట్టుకునే ఈ ప్రభుత్వం రఘునాదపురం గ్రామంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందో చూపించమనండి అని సవాలు విసిరారు….. అలాగే జీడీ మామిడి ఎక్కువగా పండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం జీడి మామిడి రైతులు ఎదురుకుంటున్న సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని….సరైన ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం….రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పూర్తి ప్రణాళికను సిద్ధం చేసి రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు…

అదే విధంగా అభివృద్ధి పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలియజేస్తూ ప్రకృతి వనరులను దోచేసి మీ ప్రాంతం అభివృద్ధి చేస్తాం అని కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలనీ చూస్తుందని కానీ ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మే అవకాశం లేదని ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ YSRCP తట్టా బుట్టా సద్దె రోజు త్వరలోనే రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసారు…

ఈ కార్యక్రమంలో రఘునాధపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరామహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు..

Around 150 people from ruling party YSRCP joined Janasena under the leadership of Rajanagaram Janasena party leader Mr. Battula Balaramakrishna in Raghunathapuram village of Rajanagaram mandal.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *