జీడి మామిడి, మామిడి రైతులతో పోరుబాట పట్టిన “బత్తుల ”
ఈ రోజు రాజానగరం మండలం, రాజానగరం గాంధి బొమ్మ సెంటర్ లో జీడిమామిడి (జీడిపిక్కల), మామిడి రైతుల పక్షాన నిరసన ధర్నా చేసిన జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు.
గత నాలుగు సంవత్సరాలుగా జీడిమామిడి,మామిడి రైతులకు పంటలు సరిగ్గా పండక… పండినా సరైన గిట్టుబాటు ధర లేక, పెట్టుబడులు ఎక్కువై, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు అండగా ఉండి ,సరైన గిట్టుబాటు ధర కల్పించాలి.
జీడి మామిడి, మామిడి రైతులతో కలిసి ప్రభుత్వ వైకరిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడి రైతులకు న్యాయం చేయాలనీ నినాదాలు చేస్తూ… రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి MPDO ఆఫీస్ వరకు భారీ ర్యాలి గా నడుచుకుంటూ వెళ్లి MDO గారికి వినతి పత్రం అందజేసి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు
రైతుకోసం రాజానగరం జనసేన ధర్నా లో బత్తుల మాట్లాడుతూ జీడి మామిడికి కనీస ధర కల్పించకపోతే రంగంలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని పేర్కొన్నారు
