స్థలం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చారు..
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు స్థలం చూపించలేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమాధానం రావడం లేదని లబ్ధిదారుడు రమేష్ వాపోయారు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ వచ్చిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ఇళ్లు లేని పేదలకు, పట్టాలు ఇచ్చిన అర్హులకు ఇళ్ల స్థలాలను వెంటనే ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తప్పకుండా ఈ సమస్యలను ప్రభుత్వానికి చేరేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
