ఆంధ్ర ప్రదేశ్మీడియారాజమండ్రివారాహి యాత్ర

ఏలూరు నుంచి వారాహి విజయ యాత్ర రెండో దశ ప్రారంభం

Share this Post

ఈ నెల 9న ఏలూరులో శ్రీ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి విజయ యాత్ర రెండో దశ ఏలూరు నుంచి ప్రారంభించడానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. ఆయన ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది. ఏలూరుతోపాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలసి స్థానిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడతారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *