ఆంధ్ర ప్రదేశ్మీడియావిజయవాడ

పాలించే వారే నీతి తప్పి మాట్లాడితే ఎలా?

Share this Post

  • పిల్లల సభలో సీఎం మాట్లాడిన మాటలు దారుణం
  • సీఎం దిగజారుడు మాటలే వైసీపీ వాళ్లకు, వైసీపీ పెంపుడు వెబ్ సైట్లకు రూట్ మ్యాప్
  • శ్రీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన నీచం
  • వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలి
  • డీజీపీ కార్యాలయం వద్ద జనసేన వీర మహిళల ధర్నా

‘రాష్ట్రాన్ని పాలించే నాయకుడు పాలసీల మీద సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. పిల్లలకు నీతులు చెప్పాల్సిన ప్రజా కార్యక్రమంలో కుటుంబంలో మహిళల గురించి, వివాహాల గురించి మాట్లాడుతున్నాడు. వైసీపీ నాయకుడే ఇలా తయారైతే, ఆ పార్టీ కార్యకర్తలు ఆ దరిద్రపు మాటలనే తీసుకొని మరింత రెచ్చిపోతున్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, ఆయన ఇంట్లోని వారిపై దూషణలకు దిగుతున్నారు. దీనిపై జనసేన వీర మహిళలుగా పార్టీ సిద్ధాంతాలను అనుసరించి, ప్రజాస్వామ్య పద్ధతిలోనే న్యాయపరంగా పోరాడుతామ’ని జనసేన పార్టీ వీర మహిళలు గర్జించారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వివాహాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యంగా పెట్టిన పోస్టులు, దూషణలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

  • వినతి పత్రం తీసుకొనేందుకు సుముఖత చూపని డీజీపీ
    డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జనసేన వీర మహిళలను పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళా విభాగం నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. డీజీపీకి వినతిపత్రం సమర్పించేందుకు తమను అనుమతించాలని వీర మహిళలు పట్టుబట్టగా, కార్యాలయంలోకి అనుమతించబోమంటూ పోలీసులు బ్యారికేడ్లు అడ్డు పెట్టారు. దీంతో వీర మహిళలంతా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై దుష్ప్రచారం చేస్తున్న వర్రా రవీంద్రారెడ్డి, వైసీసీ పెయిడ్ ఆర్టిస్టులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినదించారు. సుమారు గంటన్నర పాటు వీర మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు 10 మందిని డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతిచ్చారు. కార్యాలయం లోపల కూడా వీర మహిళల నుంచి డీజీపీ నేరుగా వినతపత్రం తీసుకునేందుకు ఒప్పుకోలేదు. డీజీపీ తీరు పట్ల వీర మహిళా విభాగం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప, వీర మహిళా విభాగం నేతలు శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, శ్రీమతి పోతిరెడ్డి అనిత, శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి మొబీనా, శ్రీమతి రావి రమాదేవి, శ్రీమతి బడే కోమలి, శ్రీమతి శివపార్వతి, శ్రీమతి సోమరౌతు అనురాధ, శ్రీమతి ఆసియా, శ్రీమతి తిరుపతి అనూష, శ్రీమతి సాయి చైతన్య తదితరులు డీజీపీ కార్యాలయంలో వినతినపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు, విజయవాడ, గుంటూరు సిటీలకు చెందిన వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
  • మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
    జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ వైసీపీ పెయిడ్ ఆర్టిస్టు, వైఎస్ కుటుంబ సన్నిహితుడు వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన వీర మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానపర్చే విధంగా పోస్టులు పెడుతున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ క్రైమ్ యాక్ట్ కింద అతని ట్విట్టర్ ఖాతాను వెంటనే సస్పెండ్ చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ సీఐ శ్రీ బి. అంకమరావు హామీ ఇచ్చారు.
  • పాలసీల మీద మాట్లాడండి: శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
    జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సత్తా ఉంటే పాలసీల మీద సమాధానం చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద సమాధానం చెప్పాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటు. సీఎం జగన్ రెడ్డి ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు అన్న సంగతి మరిచిపోయి, ఆయన హోదాను పక్కనపెట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం హేయం. దీనిపై జనసేన పార్టీ తరఫున న్యాయపరంగా పోరాడుతాం.
  • వారాహి విజయయాత్ర విజయవంతం తట్టుకోలేక అక్కసు: శ్రీమతి గంటా స్వరూప, రాష్ట్ర కార్యదర్శి
    వారాహి యాత్ర విజయవంతం కావడం వైసీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజా స్పందన చూసి వైసీపీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. పెయిడ్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లలో వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టానుసారం మాట్లాడటం అత్యంత దారుణం. ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతుంటే ఆయన పార్టీ కార్యకర్తలు, పెంపుడు వెబ్ సైట్లు కూడా ఆ మాటల్ని రూట్ మ్యాప్ గా తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ మహిళలు ఉంటారు. వారిని వ్యక్తిగత దూషణలకు ఉపయోగించడం వైసీపీ నాయకుల నైజంగా మారింది.
  • రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి దిగజారాడు: శ్రీమతి రావి సౌజన్య, వీర మహిళ విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్
    కురుపాం వెళ్లి అమ్మఒడి డబ్బులను జమ చేసే సభలోనే పిల్లల ముందు ఈ ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడారు. ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల గురించి పిల్లల ముందు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి. రాష్ట్రానికి పెద్దగా ఉండాల్సిన వ్యక్తే అలా మాట్లాడితే వాళ్ల కార్యకర్తలు ఇంకెలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ విధానాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ ప్రభుత్వం భయపడుతోంది. ఇంట్లోని వారిని రాజకీయాల్లోకి లాగుతోంది. ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
  • జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు సారాంశం
    శ్రీ పవన్‌ కళ్యాణ్‌గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సంబంధీకుడు, వైఎస్ కుటుంబ సన్నిహితుడు వర్రా రవీంద్రా రెడ్డి తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి రాష్ట్ర డీజీపీకి విన్నవించేదుకు ఆయన కార్యాలయానికి వెళ్ళారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఉద్దేశించిన విజ్ఞాపన స్వీకరించడానికి కూడా డీజీపీ అంగీకరించ లేదు. తదుపరి మంగళగిరి పోలీస్ స్టేషన్లో శ్రీమతి యశస్వి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో – రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి జూన్‌ 28వ తేదీన నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అభ్యంతరకరమైన విమర్శలు చేయడం దురదృష్టకరం. దీనికితోడు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అందరూ రెచ్చిపోయి మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా పరిగణించాలని యశస్వి కోరారు. మా మనోభావాలు పరిరక్షించాల్సిదిగా పోలీసు శాఖవారికి విన్నవిస్తూ…వైసీపీ నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడాన్ని నిరోధించాల్సిందిగా పోలీసు వారిని అభ్యర్ధిస్తున్నాను అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • ఆ ఫిర్యాదులో చేసిన ప్రధాన డిమాండ్లు
  1. వర్రా రవీంద్ర రెడ్డిని ఐపీసీ 500, 506, 509 సెక్షన్ల కింద తక్షణం అరెస్టు చేయాలి.
  2. రాజకీయ నాయకులు అభ్యంతరకర, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయకుండా డీజీపీ వారికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలి.
  3. మన సమాజంలో మహిళలకు పరువు నష్టం కలిగించే విధంగా వార్తలు, ప్రకటనలు చేయకుండా వైసీపీ నేతలను
    కట్టడిచేయాలి.
  4. ఈ వ్యాఖ్యలు చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకోనేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలి.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *