పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు లోని జనసేన పార్టీ మండల కార్యాలయం పై వైసీపీ గుండాలు దాడి
పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు లోని జనసేన పార్టీ మండల కార్యాలయం పై మండల అధ్యక్షులు ఆదినారాయణ గారు అలాగే, ఉపాధ్యక్షులు మేచినేని సంజయ్ గారు మరో 8 మంది జనసైనికులమీద నిన్న రాత్రి సుమారు 60 మంది వైసీపీ గుండాలు దాడి చేసారు. కార్యాలయాన్ని ధ్వంసం చేసారు విషయం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు గారు స్పందించారు.7 మండల అధ్యక్షులు లీగల్ సెల్ కమిటీ సభ్యులు కొండబత్తుల నరసింహారావు గారు , D.K.V ప్రసాద్ బాబు గారు ,జనసైనికులు, నాయకులతో కలిసి వేలేరుపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేయించారు.ఈ విషయాన్నీ వదిలేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.
