శ్రీ యలమర్తి సోమబ్రహ్మం ఆత్మకు శాంతి చేకూరాలి
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మామ గారైన శ్రీ యలమర్తి సోమబ్రహ్మం ఆకశ్మిక మృతి పట్ల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. శ్రీ సోమబ్రహ్మం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా పెరుగ్గూడెం గ్రామానికి చెందిన ఆయన రైతుగా వ్యవసాయ రంగంలో ఉండి ఆదర్శ జీవితం గడిపారు. శ్రీ సోమబ్రహ్మం కుటుంబానికీ, శ్రీ మనోహర్ కుటుంబానికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు.
