నియోజకవర్గంలో అడుగడుగునా హారతులతో జనసేనానికి అపూర్వ స్వాగతం
హలో ఏపీ.. బైబై వైసీపీ అని నినదించిన పి.గన్నవరం అరాచకం ఆగాలి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి… అదే వారాహి విజయ యాత్ర లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనం బాగుపడాలంటే జగన్ పోవాలి అంటూ పునరుద్ఘాటించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా అమలాపురం పర్యటన ముగించుకుని రాజోలు బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ కి పి.గన్నవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బండారులంక, అంబాజిపేట, మాచవరం, పి. గన్నవరంలలో ఆడపడుచులు అడుగడుగునా హారతులు పట్టారు. వందలాది ద్విచక్ర వాహనాలతో జనసైనికులు ర్యాలీ నిర్వహించారు. జనసేనాని రాక సందర్భంగా ఆయన్ను స్వాగతించేందుకు వచ్చిన జనంతో పి.గన్నవరం సెంటర్ కిక్కిరిసింది. ఆశేష జనవాహిని ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తనకు ఘన స్వాగతం పలికిన ఆడపడుచులకు, జన సైనికులకు, పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు కట్టిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హలో ఏపీ… బైబై వైసీపీ అంటూ నినదించారు