ఆంధ్ర ప్రదేశ్తిరుపతిమీడియా

ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త ఏంటో తెలుసుకునేందుకు నెల రోజులు ఆగుతాము : ప‌వ‌న్ క‌ల్యాణ్

Share this Post

ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త ఏంటో తెలుసుకునేందుకు తాము నెల రోజులు ఆగుతామ‌ని ట్వీట్ చేశారు జ‌న‌సేన అధినేత‌..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అన్నమయ్య డ్యామ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వ స్పందన.. మోకాలడ్డేలా, కంటి తుడుపు చర్యలా ఉండబోదని ఆశిస్తున్నా. మీరిచ్చిన హామీని ఎంత వరకు నిబద్ధతతో నెరవేర్చారో చూసేందుకు మరో నెల రోజులు జనసేన ఎదురుచూస్తుంద‌ని.. ఓ న్యూస్ వెబ్ సైట్ కథనాన్ని ఆయన షేర్ చేశారు. ఇంతకుముందు కూడా అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం, బాధితులకు సాయంపై ట్విట్టర్ వేదికగా పవన్ విమర్శలు చేశారు.
అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి 18 నెలలు గడిచింది. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక. కనీసం ఈరోజుకీ వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలల్లో సాధించింది ఏమిటయ్యా అంటే.. అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పార‌న్నారు. కేంద్ర జల వనురుల శాఖ మంత్రి షెకావత్.. రాజ్యసభలో ఇది (అన్నమయ్య డ్యామ్ ఘటన) రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.

We will wait for a month to know the government's commitment: Pawan Kalyan

Power star Pawan Kalyan tweeted that they will wait for a month to know what the government's commitment is. Janasena chief Pawan Kalyan responded to the District Collector's promise that the construction of houses would be completed for the victims of Annamaiya Dam within a month.I hope the YCP government's response to the Annamayya Dam victims will not be knee-jerk and eye-wiping. He shared an article on a news website that Janasena is waiting for one more month to see how committed you have been to fulfill your promise. Earlier too, Pawan had criticized the reconstruction of Annamaiya Dam and the help to the victims on the Twitter platform.

He proudly announced that the Annamayya Dam will be fully reconstructed and the interests of the owners will be protected within a year. 18 months have passed since the accident. The completion of the project is an ant to God. At least not today. What has been achieved in these 18 months? said that His associate Ponguleti was entrusted with the reverse tendering drama with an additional benefit of 3.94 percent and awarded the work for Rs.660 crores. Union Minister Shekawat clearly said in the Rajya Sabha that this (Annamaiya Dam incident) is a failure of the state government. Pawan Kalyan revealed through a tweet that if an international study is done on this incident, the reputation of our country will be damaged.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *