జాతీయంతెలంగాణమీడియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Share this Post

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా జూన్‌ 2నుంచి 22వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పల్లె , పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోట దశాబ్ది ఉత్సవాల సంబరాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవని, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిందని పేర్కొన్నారు. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.

“తెలంగాణ కీర్తి అజరామరం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను” అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Pawan Kalyan greeted the people on the occasion of Telangana State Decade celebrations

Jana Sena chief Pawan Kalyan extended greetings to the people of Telangana on the occasion of Telangana Independence Day. Telangana, which emerged as the 29th state in the country, today stands as an example for the country and is ready for the decade celebrations. On this occasion, the state government has decided to organize the decade celebrations grandly from June 2 to 22. As a part of this, the celebrations of the decade are going on everywhere, regardless of whether it is rural or urban.

Jana Sena chief Pawan Kalyan extended his heartiest greetings to all the people of the state on the occasion of Telangana state birth anniversary celebrations. On this occasion, he said that the decade celebrations which are going on from today to 22nd are historic and Telangana state came into being as a result of the sacrifice of many fighters. He declared that poverty-free Telangana should be invented, including farmers, cultivators, laborers, and everyone living on this land to lead a happy life.

"The glory of Telangana is eternal. Heartfelt greetings to all the Telangana people on the occasion of Telangana state birth decade celebrations. The decade celebrations that are going on from today till the 22nd are historic. The emergence of Telangana state is the result of sacrifice of many fighters. I pay tribute to all such sacrifices. I want a poverty-free Telangana, farmers, farmers, laborers... everyone living on this land should lead a happy life... I want the fame and glory of Telangana to shine forever," the Janasena party shared through its Twitter account.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *