ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

భీమవరంలో ఇంచార్జ్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారు

Share this Post

Joint West Godavari President Kotikalapudi Govinda Rao organized an emergency meeting of in-charges at Bhimavaram.

నేడు భీమవరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారు ఏర్పాటు చేసిన ఇంచార్జ్స్ అత్యవసర సమావేశంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారు, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ గారు పాల్గొన్నారు.20రోజులు పాటు భారీ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూదని పోలీస్ సెక్షన్ 30 అమలులోకి తీసుకువస్తున్నట్లు ఇటీవల DSP అంబికా ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు.జూన్ 14న మొదలు కాబోతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారహి యాత్రకు వైసీపీ ప్రభుత్వం అడ్డు గోడ కట్టే ప్రయత్నం చేస్తుందని, అరచేతిలో అగ్నిని దాచాలని అనుకోవడం హాస్యాస్పదం అని, ప్రభుత్వం చేసే మోసాలను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బయట పెడతారనే భయంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ ను అడ్డం పెట్టుకుని ఈ పనులు చేస్తుంది అని,ఎవరు ఎన్ని అడ్డంకులు వేసిన ఎన్ని జీవోలు తెచ్చిన ఒక్క జనసైనుకుడిని కూడా ఆపలేరని, మా నాయకుడు యాత్ర కి వస్తుంటేనే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందని, మా నాయకులు యాత్ర చేస్తారు దమ్ముంటే ఆపండి అని పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు గారు సవాల్ చేసారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *