వారాహి యాత్రను జయప్రదం చేయండి : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, అరుకు పార్లమెంట్ ఇంచార్జ్ వి గంగులయ్య, నర్సీపట్నం
ఈ నెల 14 నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే వారాహి యాత్ర వేలాదిగా జనసేన శ్రేణులు తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సీపట్నం వారాహి రధయాత్ర సమన్వయకర్త బొలిశెట్టి సత్యనారాయణ అరుకు పార్లమెంట్ ఇంచార్జ్ వి గంగులయ్యపిలుపునిచ్చారు. శనివారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్జీఒ హోమ్ లో వారాహి యాత్రకు సంబంధించి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారాహి రధయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ వారాహి యాత్రపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ యాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సంఘీభావం తెలపాలన్నారు. వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సంక్షేమం పేరుతో సంక్షోభం వైపు అడుగులేస్తున్న ప్రభుత్వ విధానాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరిస్తారన్నారు. కావున ఈ యాత్రను జనసైనికులు విజయవంతం చేయాలన్నారు. పాడేరు ఇన్చార్జ్, నర్సీపట్నం వారాహి యాత్ర సమన్వయకర్త వంపూరు గంగులయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర ప్రత్యర్ధులపై దండయాత్ర, ప్రజాసమస్యలపై పోరాటయాత్ర, జనసైనికులకు ఉత్సాహయాత్ర అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, నాతవరం మండల అధ్యక్షులు వెలగా వెంకటరమణ, సీనియర్ నాయకులు శివ, వూడి చక్రవర్తి, మాకవరపాలెం నాయకులు కర్రి సంతోష్, కొండలరావు, నియోజకవర్గంలోని జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
