పామర్రులో వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ – ప్రజలు భాగస్వాములు కావాలంటూ జనసేన నేతల పిలుపు
నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, యాత్రను విజయవంతం చేయాలని పార్టీ పామర్రు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్ర ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని తెలిపారు. యాత్రలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో పాటు వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని స్పష్టం చేశారు. శనివారం వారాహి యాత్ర గోడపత్రికను పామర్రు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రజల నుంచి వారాహి యాత్రకు మద్దతు కోరారు. ఎన్నికల ముందు పోరాట యాత్ర ద్వారా నాటి ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీ పవన్ కళ్యాణ్., ఇప్పుడు స్సందించే గుణం కరువైన వైసీపీ ప్రభుత్వంలో స్పందన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తారని తెలిపారు.. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు శ్రీ కాకి ఝాన్సీ, రాపర్ల ఎంపీటీసీ సభ్యులు శ్రీ కోనపురెడ్డి సుబ్బారావు, పమిడిముక్కల మండల అధ్యక్షులు శ్రీ సనక కిరణ్, మొవ్వ మండల అధ్యక్షులు శ్రీ చలమలశెట్టి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు శ్రీ మేరుగ సురేష్, మండల కమిటీ సభ్యులు చెప్పుకట్ల శ్రీనివాసరావు, శ్రీ గూడవల్లి వీరబాబు, శ్రీ యర్రం శెట్టి వీరస్వామి, శ్రీ పోలిశెట్టి నవీన్, శ్రీ ఏనుగు వెంకటరత్నం, శ్రీ కాకర్ల వీరేంద్ర, శ్రీ కొప్పురాతి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
