వారాహి యాత్ర విజయవంతం కావాలని పోలిరెడ్డి (PVR) ఆధ్వర్యంలో మహా పాదయాత
Maha Padayata under the leadership of Polireddy (PVR) to make the Varahi Yatra a success
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జూన్ 14 నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభిస్తున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ నిడదవోలు నియోజకవర్గం నాయకులు, మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం (పీవీఆర్) ఆధ్వర్యంలో విజ్జేశ్వరం నుండి తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం వరకూ సుమారు 14 కిలోమీటర్లమేర మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ మద్దతు పలకాలని, సమస్యలు పరిష్కారం కావాలంటే పవన్ పాలన రావాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై మా పోరాటం ఆగదని వారహి యాత్రతో నిడదవోలు వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, ప్రశాంతంగా నిద్రపోయే రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నరు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు రంగా రమేష్, ఉపాధ్యక్షులు మేడా పూర్ణచంద్రరావు, దిద్దే రాజు, నార్ని రామకృష్ణ, బెల్లపుకొండ పుష్పావతి, వద్దిరెడ్డి శివ గణపతి రాజు, కస్తూరి వెంకట సుబ్బారావు, యడ్లపల్లి సత్తిబాబు, చోడపనేని మూర్తి, విజ్జేశ్వరం బ్రహ్మాజీ,శాంతి కుమార్, కోయి దుర్గాప్రసాద్ మరియు వివిధ గ్రామాల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
